లాక్‌డౌన్‌లో హీరో అయిన సోనూసూద్ ఆత్మ‌క‌థ ఎప్పుడు వ‌స్తుందో తెలుసా..

క‌రోనా అంద‌రి జీవితాల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన విష‌యం తెలిసిందే. అయితే అదే క‌రోనా ప‌లువురికి ఆకాశ‌మంత సంప‌ద మంచి పేరు తెచ్చిపెట్టింది. వీరిలో ప్ర‌ముఖంగా వినిపించే వ్య్తి సోసూసూద్‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌కు సోనూ హీరో అయిపోయారు.

లాక్‌డౌన్‌లో ఎక్క‌డి వారు అక్క‌డ చిక్కుకొని పోయి ఉన్న స‌మ‌యంలో సోనూసూద్ మామూలు స‌హాయం చేయ‌లేదు. ఆయ‌న సొంత ఖ‌ర్చుతో ఎంతో మందిని సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అంత‌టితో ఆగ‌కుండా స‌హాయం చేయ‌మ‌ని ఎవ్వ‌రు అడిగినా సోనూ కాద‌న‌లేదు. విద్యార్థుల చ‌దువుల‌కు, పేద వాళ్ల ఇళ్లు గ‌డ‌వ‌డానికి , రైతుల జీవ‌నోపాధికి ఇలా అంద‌రికీ ఆయ‌న స‌హాయం చేశాడు. ఇప్పుడు సోనూసూద్ దేశంలో రియ‌ల్ హీరో అంటారు. నిస్వార్ధంగా ఆయన చేసిన సాయం కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.

లాక్‌డౌన్‌ కాలంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాలతో ఐ యామ్‌ నో మెస్సయ్య పేరుతో సోనూసూద్‌ ఆత్మకథను పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ సంస్థ ప్రచురిస్తోంది. దీనికి మీనా అయ్యర్‌ సహ రచయిత్రి. వలస కూలీలను కాపాడి వారిని సొంతూళ్లకు చేర్చడంలో ఎదురైన సవాళ్లు, భావోద్వేగానికి గురి చేసిన సంఘటనలను సోనూసూద్‌ ఈ పుస్తకంలో వివరించారు. లాక్‌డౌన్‌ కాలంలో తను విన్నవి, తనకు తారస పడిన సంఘటనలు తన జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయో, జీవితంపై తన దృక్పథాన్ని ఎలా మార్చాయో ఈ పుస్తకం ద్వారా సోనూసూద్‌ అభిమానులతో పంచుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here