చిరంజీవికి క‌రోనా పాజిటివ్ రావ‌డంలో త‌ప్పు ఎవ‌రిదో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు క‌రోనా నెగిటివ్ అని కూడా ఇప్పుడు వ‌చ్చేసింది. అయితే దీనిపై మెగాస్టార్ ఒక క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు ఒక‌సారి పాజిటివ్ అని చూపిస్తే మూడు సార్లు నెగిటివ్ అని రిపోర్టు వ‌చ్చింద‌న్నారు.

మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ప్ర‌ధానంగా ఆయ‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన నాగార్జున‌తో పాటు తెలంగాణ సీఎంఓ అధికారులు కూడా. అయితే చిరంజీవి ఊహించ‌ని ట్విస్టే ఇచ్చారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు లక్ష‌ణాలు ఏమీ లేవ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా వ‌చ్చిన‌ట్లే క‌దా అనుకున్నాం. అయితే రెండు రోజుల‌కు ఆయ‌న తిరిగి టెస్టులు చేపించుకోవాల‌ని ఆలోచ‌న రావ‌డం నిజంగా గ్రేట్ అంటున్నారు. ఎందుకంటే అలా టెస్ట్ చేయిస్తే కానీ ఆయ‌న‌కు క‌రోనా నెగిటివ్ అన్న విష‌యం తెలియ‌లేదు. మొద‌ట ఆయ‌న‌కు ప‌రీక్షించిన కిట్ త‌ప్పుడు రిపోర్టు ఇచ్చింద‌న్న‌విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది ఒక్క చిరంజీవికే ఇలా జ‌రిగిందా అంటే అది మ‌న పొర‌పాటే. ప్ర‌తి రోజూ ప‌రీక్ష‌లు చేస్తున్న వేలాది మందికి ఇలాంటి ఫ‌లిత‌మే వ‌స్తుంద‌ని చాలా మంది సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here