ట్విట్ట‌ర్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేయ‌నుందో తెలుసా..

ట్విట్ట‌ర్‌పై కేంద్ర ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌ను అలా కాకుండా జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించడాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ట్విట్ట‌ర్‌కు గ‌డువు ఇచ్చింది.

దీనిపై తీవ్ర దుమారమే రేగింది. వెబ్‌సైట్, దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ట్విట్టర్ తీరును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం దాని అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో మార్పులు చేసినప్పటికీ, లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా, జమ్మూకశ్మీర్‌లో భాగంగానే వదిలేసింది. దీంతో ఈసారి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. లేహ్‌ను ఉద్దేశపూర్వకంగానే జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించినట్టు జాక్ డోర్సీకి చెందిన ట్విట్టర్‌కు ప్రభుత్వం పంపిన నోటీసులో పేర్కొంది. రత సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు చేసిన ప్రయత్నంలో ఇది భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

లేహ్‌ను భారత ప్రభుత్వం కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ప్రకటించిందని, దాని రాజధాని లేహ్ అని తెలిపింది. దీనిపై ట్విట్ట‌ర్‌ సంతృప్తికర వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. మొత్తానికి ఈ విష‌యంలో ఐదు రోజుల్లో ఏం వివ‌ర‌ణ వ‌స్తుందో అన్న దానిపై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి విష‌యాల్లో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ప‌బ్లిక్ కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here