ఏపీలో ఇప్ప‌టి నుంచి మ‌ద్యం ఇక్క‌డ కూడా అమ్ముతారు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇక నుంచి మందుబాబులు క్లాస్‌గా తిర‌గొచ్చు. ఎందుకంటే ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న మ‌ధ్యం పాల‌సీ వ‌ల్ల చిన్న చిన్న షాపుల‌కు మ‌ధ్యం కోసం వెళ్ల‌కుండా ఎంచ‌క్కా మాల్స్‌లోనే తీసుకోవ‌చ్చు. మ‌ద్యంలో కొత్త విధానం స‌ర్కార్ తీసుకొచ్చింది.

ఏపీలో మందుబాబులను ఆక‌ట్టుకుంటోంది కొత్త మ‌ద్యం పాల‌సీ విధానం. ప్ర‌భుత్వం ఏం చేసిందంటే రాష్ట్రంలో మ‌ద్యం మాల్స్ నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది. వాక్ ఇన్ షాప్స్ పేరుతో వీటిని నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. మ‌ద్యం దుకాణాల మాదిరిగానే ఓన్లీ మందు కోస‌మే మాల్స్‌ను పెట్ట‌నున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు దుకాణాల్లో కొన్ని ర‌కాల బ్రాండ్లే దొర‌కుతున్నాయి. అయితే ఈ కొత్త మ‌ద్యం మాల్స్ వ‌ల్ల అన్ని ర‌కాల బ్రాండ్లు అందుబాటులో ఉండేందుకు అవ‌కాశం ఉంది.

రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ప్ర‌ధాన న‌గ‌రాలు, ముఖ్య ప‌ట్ట‌ణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఇవి ఏర్పాటుచేయాల‌ని అనుకున్న చోట ఇప్పుడున్న మ‌ద్యం షాపుల‌ను తొల‌గిస్తారు. ఏపీ ప్ర‌భుత్వం ఆద్వ‌ర్యంలో గ‌త సంవ‌త్స‌రం 3500 మ‌ద్యం దుకాణాలు ప్రారంభ‌మ‌వ్వగా వాటిని ఈ ఏడాది మేలో 2,934కు కుదించారు. ఇప్ప‌టికే ఉన్న మ‌ద్యం షాపుల‌తో పాటు కొత్త‌గా ఏర్పాటు చేయబోయే మ‌ద్యం మాల్స్‌ను మొత్తం క‌లిపి 2,934కి మించ‌కుండా ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో 50 నుంచి 100దాకా ఇవి ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. ఏపీ స్టేట్ బెవ‌రేజెస్ కార్పోరేష‌న్ లిమిటెడ్ వీటిని నిర్వ‌హిస్తుంది. కొత్త మ‌ద్యం పాల‌సీ వ‌ల్ల మందుబాబులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here