ఆ వివ‌రాలు తెలిశాక అంద‌రి చూపు జ‌గ‌న్ వైపే..

దేశం మొత్తం ఇప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్ వైపే ఉంది. ఇందుకు కార‌ణం కొత్త‌గా ముఖ్య‌మంత్రి అయిన వై.ఎస్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.. తీసుకుంటున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు. దీంతో ఏపీకి దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వచ్చింది.

అస‌లు ఏపీలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని ఇత‌ర రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయ‌ని తెలిసింది. నూత‌న ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్ప‌డంతో పాటు, వ్యాపార వేత్త‌ల‌కు అవకాశాలు క‌ల్పించ‌డంలో ఏపీ ఏ విధ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంందో అన్న వివ‌రాలు తెలుసుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ఇటీవ‌ల మొద‌టి స్థానం సొంతం చేసుకుంది. దీంతో మిగ‌తా రాష్ట్రాలు కూడా ఏపీలో అమ‌ల‌వుతున్న విధానాల‌ను అమ‌లు చేసేందుకు ముందుకు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇండియాలోనే ఎంతో సంప‌న్న‌మైన రాష్ట్రాల‌ను కాద‌ని ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లో రావ‌డం అంత ఈజీ కాద‌ని మేధావులు అంటున్నారు. ఎందుకంటే ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలే ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందుకే కొత్త కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటున్న ఏపీ దేశానికే మార్గ‌నిర్దేశం అవుతుంద‌ని అంటున్నారు. ఇక ఏపీ కూడా ఈ సారి మ‌ళ్లీ కొత్త విధానాలు తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఇటీవ‌ల ఏపీలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు ఇటు రాజ‌కీయంగానూ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ సీఎం జ‌గ‌న్‌కు అనుకూలంగానే క‌నిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీవైపు చూస్తున్నాయంటే ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. అంత‌ర్జాతీయ ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హిస్తూ ఏపీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాల‌ని యోచిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here