ఏపీ ప్ర‌భుత్వం త‌రుపున బాలసుబ్ర‌హ్మ‌ణ్యంకు నివాళి..

సుప్ర‌సిద్ద గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఘ‌న నివాళి అర్పించింది. చెన్నైలో జ‌రిగిన బాలు అంత్య‌క్రియ‌ల్లో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పాల్గొన్నారు. ఏపీ త‌రుపున ఆయ‌న బాలు కు ఘ‌న నివాళి అర్పించి.. కుటుంబ సభ్యుల‌తో మాట్లాడారు.

బాల‌సుబ్ర‌హ్మ‌హ్మ‌ణ్యం మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే సీఎం జ‌గ‌న్ స్పందించారు. అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న చెన్నైకి వెళ్లాల‌ని ఆయ‌న మంత్రి అనిల్‌తో చెప్పారు. సీఎం ఆదేశాల‌తో మంత్రి అనిల్ చెన్నై వెళ్లిపోయారు. ఉద‌యం నుంచి ఆయ‌న అక్కడే ఉండి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం త‌రుపున ఆయ‌న సంతాపం ప్ర‌క‌టించారు. సీఎం జ‌గ‌న్ సంతాప సందేశాన్ని బాలు కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు.

బాలసుబ్ర‌హ్మ‌న్యం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాభ్యాసం చేసిన విష‌యం తెలిసిందే. తెలుగోడి పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా చేసేలా కృషి చేసిన బాలు అంత్య‌క్రియ‌ల్లో ప్ర‌భుత్వం త‌రుపున మంత్రిని పంప‌డంపై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హానుభావుల‌ను ప్ర‌భుత్వాలు ఎప్ప‌టికైనా గుర్తించాల‌న్నారు. అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న అనిల్ కార్య‌క్ర‌మాన్ని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. నెల్లూరులో వేద నిల‌యంగా మారిన బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గృహాన్ని ప‌ర్య‌వేక్షిస్తామ‌ని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here