వాస్తవికతకు దగ్గరగా దిశ ట్రైలర్..!

గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ శివారు ప్రాంతం, అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ యువతిపై కొంతమంది యువకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి… కాల్చి చంపేసిన విషయం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అనంతరం పలు నాటకీయ పరిణామాలలో ఆ అఘాయిత్యానికి పాల్పడిన వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఈ కథాంశాన్నే సినిమాగా తెరకెక్కిస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. శుక్రవారం చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం దిశ ట్రైలర్ ను విడుదల చేశారు. రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రెండు నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వాస్తవికతకు అత్యంత దగ్గరగా ఉంది. ఈ చిన్న ట్రైలర్ లోనే సినిమా మొత్తాన్ని చూపించేశాడు వర్మ. ఇక ట్రైలర్ లో వస్తున్న దిశ, దిశ అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొన్ని సన్నివేశాలు గగుర్పొడిచేలా ఉన్నాయి. మరి ఈ సినిమా ద్వారా వర్మ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి. మరి ఈ చిత్రం ఓటీటీలో  విడుదలవుతుందా.? లేదా.. థియేటర్లలో విడుదల చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here