స‌స్పెండ్ అయిన ఉద్యోగిని వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర‌కు ఫోన్ చేసిన సీఎం..

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న అంటే హ‌డావిడిగా ఉంటుంది. అన్ని శాఖ‌ల అధికారులు అల‌ర్ట్‌గా ఉంటారు. అయితే అలాంటి సీఎం ప‌ర్య‌న‌ట‌లో విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేద‌న్న కార‌ణంతో స‌స్పెండ్ అయిన ఓ ఉద్యోగి ప‌ట్ల ఉదారంగా వ్య‌వ‌హ‌రించారు ముఖ్య‌మంత్రి. ఇది మ‌ద్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఉందంటే ఏ చిన్న ఇబ్బంది రాకుండా అప్ర‌మ‌త్త‌మై ఉంటారు. సీఎం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్రోగ్రాం ముగించుకొని ఆయ‌న తిరిగి వెళ్లేదాకా టెన్ష‌న్ వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ఎలాంటి పొర‌పాట్లు జ‌రిగినా ఉద్యోగులు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. కాగా ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్‌లో ప‌ర్య‌టించారు. సీఎం టూర్లో భాగంగా ఆయ‌న అక్క‌డే బ‌స చేస్తే సీఎంతో పాటు అధికారుల‌కు మొత్తం ఆహారం స‌ర‌ఫ‌రా చేయాల్సిన బాధ్య‌త పుడ్ సేఫ్టీ అధికారి చూసుకుంటూ ఉంటారు.

ఇక్క‌డ కూడా సీఎం ప్రోగ్రాంలో ఫుడ్ పెట్టారు. అయితే చ‌ల్ల‌బ‌డిపోయిన చ‌పాతీలు వ‌డ్డించారు. విష‌యంపై సీఎం ప్రోగ్రాం ముగిసిన త‌ర్వాత స‌ద‌రు స్వామి అనే ఉద్యోగిని స‌స్పెండ్ చేశారు. ఈ విష‌యం ఎలాగోలా సీఎం దీష్టికి వెళ్లింది. దీంతో వెంట‌నే స్పందించిన ఆయ‌న స‌ద‌రు ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాల‌ని జిల్లా అధికారుల‌కు తెలిపారు. చ‌ల్ల‌టి చ‌పాతీలు తింటే తాను ప‌ట్టించుకోన‌ని, తానుకూడా సాదార‌ణ‌మైన వ్య‌క్తినే అన్నారు. ఉద్యోగులందరూ త‌మ విదులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here