పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు తాజాగా వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఇక ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో కనిపించిన ఫస్ట్ లుక్ సినిమాపై.. అంచనాలను పెంచేసిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో వైట్ టీ షర్ట్ లో ఉన్న పవన్ కాస్త సన్నగా కనిపిస్తున్నాడు. కొద్ది సమయంలోనే పవన్ ఇంతలా మారాడా అని ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని.. పాత ఫోటో నే మళ్ళీ నెట్టింట్లో వైరల్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తమ అభిమాన నటుడిని ఇలా యంగ్ లుక్ లో చూసిన పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో సినిమాల్లో నటించక అభిమానులను నిరాశపరిచిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.