ద‌మ్ముంటే చంద్ర‌బాబు రాజీనామా చేయాలి.. మంత్రి కొడాలి నాని

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై మంత్రి కొడాలినాని మండిప‌డ్డారు. త‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి రాజీనామా చేసి చంద్ర‌బాబు ఎన్నికల‌కు వెళ్లాల‌న్నారు. అక్క‌డ వారంత గెలిస్తే మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తాము మార్చుకుంటామ‌న్నారు.

మూడు రాజధానులు వ‌ద్ద‌ని చెబుతున్న‌ చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే రాజీనామా చేసి గెల‌వాల‌న్నారు. అమ‌రావ‌తిలోనే రాజధాని పెట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటే టిడిపిని గెలిపిస్తార‌న్నారు. అలా రాజీనామా చేసిన చంద్ర‌బాబు పార్టీ వారంతా తిరిగి గెలిస్తే అమ‌రావ‌తిపై త‌మ ప్ర‌భుత్వం పున‌రాలోచించుకుంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల కోరిక మేర‌కు మేం న‌డుచుకుంటామన్నారు. అలా కాకుండా చంద్ర‌బాబు ఓడిపోతే త‌మ దారిలోకి రావాలని కొడాలి నాని అన్నారు. ముందు చంద్ర‌బాబు రాజీనామా చేయాల‌న్నారు.

ఇక మూడు రాజధానుల‌తో రాష్ట్రం అభివృద్ది చెందుతుంద‌ని మ‌రో నేత ధ‌ర్మాన అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దికి సీఎం జ‌గ‌న్ క‌ట్టుబ‌డి ఉన్నార‌న్నారు.  మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌ట్లోనే త‌ప్ప‌ట‌డుగు వేశార‌న్నారు.  ఒక గొప్ప న‌గ‌రం నిర్మిస్తామ‌ని రాజ‌ధానితో లింకు పెట్టడం స‌రైంది కాద‌న్నారు. ఇందులో స్వార్థ ప్ర‌యోజ‌నాలున్నాయ‌న్నారు. విశాఖ కంటే అనుకూల‌మైన ప్రాంతం ఇంకోటి లేద‌న్నారు. అయితే ఒక్క విశాఖ‌నే కాకుండా అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ది చేస్తామ‌న్నారు.

చంద్ర‌బాబు, లోకేష్ రాజీనామా చేస్తారా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here