చంద్ర‌బాబు, లోకేష్ రాజీనామా చేస్తారా..

రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు బిల్లులు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొందిన నేప‌థ్యంలో ఇప్పుడు చ‌ర్చంతా టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు మీదే ఉంది. ఎందుకంటే గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై న్యాయ పోరాటం చేసేందుకు టిడిపి సిద్ధ‌మైంది. ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాల‌ని పార్టీ ఆదేచించింది కూడా.

అయితే ఇప్పుడు పార్టీలోని 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు బ‌యట‌కు వ‌స్తున్నాయి. కాగా ఎవ‌రో రాజీనామాలు చేయడం కంటే చంద్ర‌బాబునాయుడు, లోకేష్ ఇద్ద‌రు రాజీనామాలు చేస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే అమ‌రావతి కోసం ఎంత‌కైనా పోరాడ‌తాం అంటున్న చంద్ర‌బాబు ఆయ‌న‌, ఆయ‌న కుమారుడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ను వ‌దులుకుంటారాన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

రాయ‌ల‌సీమ నుంచి బీటెక్ ర‌వి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబునాయుడుకి లేఖ పంపారు. అయితే ఇది కేవ‌లం బాబు చెతితే పంపిన‌ట్లుగా ఉంద‌ని ప‌లువురు విశ్లేశిస్తున్నారు. నిజంగా రాజీనామాలు చేయాల్సి వ‌స్తే కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌రిధిలోని వారు రాజీనామాలు చేయ‌కుండా ఇంత‌వ‌ర‌కు ఏం చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అంత‌కంటే ముందు ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేస్తే బాగుంటుంద‌ని పొలిటిక‌ల్ చ‌ర్చ సాగుతోంది.

గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన‌ప్పుడు ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌కపోవ‌డం లోకేష్‌కు క‌లిసొచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ రాజీనామాల అంశం తెర‌మీద‌కు రావ‌డంతో వారిని వీరిని అడిగేబ‌దులు లోకేష్‌తోనే రాజీనామా చేపించొచ్చు క‌దా అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ రాజీనామాలు చేస్తే క‌చ్చితంగా పార్టీ నేత‌ల్లో వీరి మాట‌ల‌పై న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని ప‌లువురు విశ్లేశిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజీనామాలు చేయడానికి చాలా మంది మొగ్గుచూప‌డం లేద‌ని తెలుస్తోంది.

మూడు రాజ‌ధానుల‌పై రాష్ట్రమంతా సానుకూల వాతావ‌ర‌ణం ఉన్న నేప‌థ్యంలో రాజీనామాలు చేసి ఏం ఉప‌యోగం ఉండ‌ద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఎంత‌వ‌ర‌కైనా పోరాడ‌తాం అని చెప్పే చంద్ర‌బాబు రాజీనామా వ‌ర‌కైనా వెళతారా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. పార్టీ నేత‌ల‌తో రాజీనామాలు చేయించి పాలిటిక్స్ న‌డ‌పాల‌ని బాబు యోచిస్తున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఈ రాజీనామాల‌పై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. ఇప్పుడు బాబు ఏం చేస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here