క‌రోనా సోకిన న‌ర్సుతో నాగ‌చైత‌న్య మీటింగ్‌..

క‌రోనాను జ‌యించిన న‌ర్సుతో హీరో నాగ‌చైత‌న్య మాట్లాడారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌రోనా అంటేనే భ‌య‌ప‌డిపోతున్న త‌రుణంలో డైరెక్ట‌ర్ శేఖ‌ర్‌క‌మ్ముల కోసం నాగ‌చైత‌న్య ఇలా చేశారు.

క‌రోనా సోకిన వారి ప‌ట్ల ఇప్పుడు చాలా చోట్ల వివ‌క్ష క‌నిపిస్తోంది. అందుకే వీటిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల నాగ‌చైత‌న్య‌కు స‌వాల్ విసిరారు. ఇందుకు స్పందించిన చైతూ ఓ ఇంట‌ర్వూలో పాల్గొని క‌రోనాను జ‌యించిన సునీత అనే ఓ న‌ర్సుతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఆమె అనుభ‌వాలు పంచుకున్నారు.

క‌రోనా సోకింద‌న్న భ‌యం ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. భ‌య‌ప‌డితే క‌రోనా ఇంకా ఎక్కువ‌గా మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతుంద‌న్నారు. అనుమానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. క‌రోనాను జ‌యించ‌డానికి మ‌నోధైర్యం అవ‌స‌ర‌మ‌న్నారు. క‌రోనాను జ‌యించిన వ్య‌క్తుల అనుభ‌వాలు తెలుసుకొని.. డిశ్చార్జ్ అయిన వారు కూడా వారి అనుభ‌వాల‌ను పంచుకోవాల‌న్నారు. ఇక ప్లాస్లా దానంపై మాట్లాడుతూ క‌రోనాను జ‌యించిన వారు ప్లాస్మా దానం చేయాల‌న్నారు. హీరోలు చెబితే ఏదైనా చేస్తారు అభిమానులు. ఇప్పుడు ఇదే హీరోలు మ‌నోధైర్యం ఇస్తున్న త‌రుణంలో అంద‌రిలో ధైర్యం రావాల‌ని అంతా కోరుకుంటున్నారు.

యోగా స్టైల్లో స‌మంత‌.. పండ‌గ చేసుకుంటున్న అభిమానులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here