విశాఖ‌లో భ‌ద్ర‌త‌పై పోలీస్ శాఖ క‌మిటీ..

రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో ఏపీలో వేగంగా ప‌రిస్థితులు మారుతున్నాయి. ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ఏర్ప‌డిన విశాఖ ప‌ట్ట‌ణంపైనే ఇప్పుడంద‌రూ ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు పోలీస్ శాఖ బ‌లోపేతానికి క‌మీటీ ఏర్పాటైంది.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో పోలీస్ వ్య‌వ‌స్థ బ‌లోపేతంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ప‌రిపాల‌నా రాజ‌ధానిలో భ‌ద్ర‌త పూర్తి స్థాయిలో పెంచాల‌ని చూస్తోంది.  ఈమేర‌కు విశాఖ పోలీస్ కమీష‌న‌ర్ క‌మిటీ చైర్మ‌న్‌గా వేస్తూ డిజిపి గౌతమ్ స‌వాంగ్ ఆదేశించారు. రెండు వారాల్లోగా ఈ క‌మిటీ నివేదిక ఇవ్వ‌నుంది.

అడ్మినిస్ట్రేటివ్ రాజ‌ధానిగా విశాఖ మార‌డంతో ముఖ్య‌మంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఉన్న‌తాధికారులు ప‌ర్య‌టిస్తూ ఉండ‌టంతో భ‌ద్ర‌త‌పై ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ మేర‌కు పోలీస్ సిబ్బంది ఎంత ఉన్నారు.. ఇంకా ఎంత అవ‌స‌ర‌మం అవుతుంద‌న్న దానిపై పోలీస్ శాఖ దృష్టి సారిస్తోంది. ఇప్పుడు వేసిన క‌మిటీలో చైర్మ‌న్‌గా విశాఖ క‌మీష‌న‌ర్‌, 8 మంది స‌భ్యులు ఉంటారు. క‌మిటీ క‌న్వీన‌ర్‌గా ప్లానింగ్ ఓఎస్‌డీ ఉంటారు. ఈ క‌మిటీలో న‌లుగురు ఐజీలు, ఇద్ద‌రు డీఐజీలు, ఓఎస్‌డీ ఉండ‌నున్నారు.

ట్రైనింగ్ ఐజీ, ప‌ర్స‌న‌ల్ ఐజీ, పీఅండ్ ఎల్ఐజీ, టెక్నిక‌ల్ స‌ర్వీసెస్ డీఐజీ, విశాఖ రేంజ్ డీఐజీ, ప్లానింగ్ ఓఎస్‌డీ క‌మిటీలో ఉంటారు.  విశాఖ‌లో పోలీసు అద‌న‌పు సిబ్బంది, స‌దుపాయాలు, పోలీస్ శాఖ‌కు కావాల్సిన మౌళిక వ‌స‌తుల‌పై క‌మిటీ అధ్య‌య‌నం చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here