‘సర్కారు వారి పాట’ నుంచి కీర్తిని తప్పించారా.?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ పూర్తికాని ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మహేష్ సరసన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ చిత్రంలో కీర్తిని ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి కీర్తిని తొలగించినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో కీర్తి స్థానంలో మరో బాలీవుడ్ భామను తీసుకున్నారని సమాచారం. కీర్తిని ఉన్నపలంగా ఎందుకు తొలగించారు..? ఆ బాలీవుడ్ భామ ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

‘సర్కారు వారి పాట’లో ‘డర్టీ’ హీరోయిన్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here