‘సర్కారు వారి పాట’లో ‘డర్టీ’ హీరోయిన్..

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరలేక్కుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్  నవంబర్ నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

అమెరికాలో దాదాపు నెల‌న్న‌ర పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంతో పాటు కొంత మంది అమెరికా వెళ్ల‌నున్నారు. ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అనిల్ క‌పూర్ నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ ను సినిమా యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విద్యాబాలన్, మహేష్ బాబుకు సోదరిగా నటిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here