లక్కీ ఛాన్స్ కొట్టేసిన తాప్సీ..?

తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది నటి తాప్సీ. పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాప్సీ తాజాగా ఓ భారీ అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుఖ్ ఖాన్ తో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో షారుఖ్ షారుక్ నటించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా కి జోడిగా తాప్సీ నటించనుందని సమాచారం. ఇదిలా ఉంటే షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ‘బద్లా’లో హీరోయిన్ గా తాప్సీ నటించిన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here