చిరంజీవిని వాడుకుంటున్న ఎన్టీఆర్

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ సినిమా ‘జై లవ కుశ హాట్ టాపిగ్గా మారింది. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు చిరంజీవి  ‘రౌడీ అల్లుడుస సీన్ ను పోలిక‌గా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. దీనిపై నెట్టింట్లో పెద్ద ర‌చ్చే జ‌రుగుతుంది. కొంత‌మంది ఎన్టీఆర్ చిరంజీవిని వాడుకుంటున్నార‌ని అంటుంటే మ‌రికొంత‌మంది చిరంజీవిని ఇన్ స్పైయిర్ గా చేసుకొని ఈ సీన్లు వాడుకుని ఉంటార‌ని వాదిస్తున్నారు. ఈ వాద‌న‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ అస‌లు విష‌యానికొస్తే. 
ఎన్టీఆర్  ‘జై లవ కుశ లో మూడు పాత్ర‌లు పోషిస్తున్నాడు. వాటిలో జై, ల‌వ‌, కుశ ఒక‌టి. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్ ఒక‌టి రిలీజ్ అయ్యింది. ఆ ట్రైల‌ర్ చూసిన వాళ్లు చిరు ‘రౌడీ అల్లుడు ని గుర్తు చేసుకుంటున్నారు. 
రౌడీ అల్లుడిలో చిరంజీవి రెండు పాత్ర‌లు పోషిస్తాడు. వాటిలో ఆటో జానీ గా ర‌ఫ్ గా, క‌ల్యాణ్ గా స్మార్ట్ గా క‌నిపిస్తాడు. అచ్చం జై ల‌వ‌కుశ‌లో  ల‌వ‌కుమార్ గా ప‌ద్ద‌తిగా ఓ సంస్థ‌లో మేనేజ‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు. అయితే  మాస్ క్యారెక్టర్ అయిన కుశ…లవ లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి నానా ర‌చ్చ‌చేస్తాడు. ఇలా ‘రౌడీ అల్లుడు’ సీన్ ను పోలిన సీన్ ‘జై లవ కుశ’లో ఉండటం గురించే అభిమానులు ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here