అది సావిత్రి గెటప్ కాదండి బాబూ – కీర్తి సురేష్

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో ఆకట్టుకున్న డైర‌క్ట‌ర్  నాగ అశ్విన్ ప్ర‌స్తుతం సావిత్రి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు చిత్ర‌సీమ‌ని మ‌కుటం లేని మ‌హ‌రాణిగా కీర్తిగ‌డించిన సావిత్రి జీవితం ఆధారం గా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో  సావిత్రిగా కీర్తి సురేష్, మరో ముఖ్యమైన పాత్రలో సమంత ,స్టార్ హీరో దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ‌, భానుప్రియ, రాజేంద్రప్రసాద్‌లు న‌టిస్తున్నారు. అయితే సావిత్రి జీవితంలో కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రిగా కీర్తి సురేష్ ను ఇలా చూపించ‌బోతున్నాడంటూ కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. అచ్చం సావిత్రం కట్టు బొట్టులో ఉన్న కీర్తి సురేష్ ద‌ర్శ‌న‌మిస్తుంది. అయితే ఈ ఫోటోల‌పై స్పందించిన కీర్తి సురేష్ ఆ ఫోటోలు చెన్నై సిల్క్ షోరూంలో దిగిన ఫోటోల‌ని చెప్పుకొచ్చింది. 
 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here