చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ రైడ్స్..150కోట్ల ఆస్తుల గుర్తింపు?

ఒకటి కాదు.. రెండు ఏకంగా 24 గంటల పాటు సోదాలు.. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు నిరాంటకంగా రెస్ట్ లేకుండా తవ్వి తీస్తున్నారు. అధికారులు నిన్న రాత్రంతా నిద్రపోకుండా మేలుకొనే కీలక డాక్యుమెంట్లను పరిశీలించి చంద్రబాబు పీఏ గుట్టుమట్లను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 2014లో అధికారంలో వచ్చాక ఆయన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)గా పనిచేసిన శ్రీనివాస్ రావును పెట్టుకున్నారు. సెక్రెటేరియట్ లో ఉద్యోగి అయిన శ్రీనివాసరావును ఏరికోరి పీఏగా పెట్టుకున్నారు.చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఆయన పీఏ శ్రీనివాసరావు కాంట్రాక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలున్నాయి.. ముఖ్యంగా కాంట్రాక్ట్ పనులు గుత్తేదారులకు కేటాయించడంలో బాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్టు కోట్లలో డీల్ చేసినట్టు ఆరోపణలున్నాయి.

భారీగా ఫిర్యాదు ఆరోపణలు నేపథ్యంలోనే చంద్రబాబు పీఏ ఇంట్లో ఐటీ సోదాలు 24 గంటలుగా నిరాటంకంగా కొనసాగుతుండడం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన నివాసులైన హైద్రాబాద్ లోని చంపాపేట్ , విజయవాడ గాయత్రి నగర్ కంచుకోట అపార్ట్ మెంట్ లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకూ ఈ ఐటీ సోదాల్లో చంద్రబాబు పీఏ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్ల రూపాయాలని సమాచారం. దానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు పీఏ ఐటీ రైడ్స్ అంతిమంగా ఎవరి మెడకు చుట్టుకుంటాయన్న ఆందోళన ఇప్పుడు టీడీపీని షేక్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here