భార‌త్‌లో క‌రోనా వ్యాక్సిన్ నిల్వ చేయ‌డం క‌ష్ట‌మేనా.. ?

క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ చాలా కీల‌కం. అయితే భార‌త్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ రావ‌డానికి ఇంకా కొంచెం టైం ప‌డుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఇత‌ర దేశాల నుంచి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అస‌వ‌రం ఉంది. అయితే ఇక్క‌డే భార‌త్‌లో స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

ఇటీవల అమెరికాకు చెందిన ఫార్మాకంపెనీ ఫైజర్ తాము రూపొందించిన టీకా 90 శాతం సత్ఫలితాలను ఇస్తున్నదని ప్రకటించింది. దీంతో భారత్ ఈ టీకాను ఇక్కడకు తెప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ వ్యాక్సిన్ స్టోరేజ్ చేయడానికి మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. భారత్‌లో మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత‌లో వ్యాక్సిన్ స్టోర్ చేయడం చాలా కష్టమని తెలుస్తోంది. చిన్న నగరాల్లో, గ్రామాల్లో ఈ విధమైన శీతలీకరణ సదుపాయాలను అందుబాటులో ఉండవని అంటున్నారు. అయితే దీనిపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు.

దేశంలో కోల్డ్‌చైన్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. కాగా ఈ వ్యాక్సిన్‌ను అమెరికా కంపెనీ ఫైజర్, జర్మన్ కంపెనీ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ 90 శాతం సత్ఫలితాలను ఇస్తుంద‌ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీంతో ఈ వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరుగుతోంది. మూడవ హ్యమన్ ట్రయల్స్ అనంతరం ఫైజర్ కంపెనీ ఈ విషయాన్నివెల్లడించింది. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ‌న్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ చాలా అవ‌స‌రం. దీంతో ఇత‌ర దేశాల వ్యాక్సిన్‌ల‌ను తీసుకోవ‌డం కూడా మంచిదే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here