ఎయిర్‌పోర్టు త‌నిఖీల్లో బుల్లెట్ల‌తో దొరికిపోయిన ఆ నాయ‌కుడు ఎవ‌రో తెలుసా..

ఎయిర్ పోర్టులోసెంట్ర‌ల్ ఇండస్ట్రియ‌ల్ సెక్కూరిటీ ఫోర్స్ త‌నిఖీలు చేస్తోంది. అయ‌తే ఈ త‌నిఖీల్లో ఓ ప్ర‌యాణీకుడికి సంబంధించిన బ్యాగుల్లో బుల్లెట్లు దొరికాయి. దీంతో వెంట‌నే సెక్యూరిటీ సిబ్బంది అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆయ‌నెవ‌రో కాదు. త‌మిళ‌నాడు కాంగ్రెస్ నేత‌.

చెన్నై జాతీయ విమానాశ్రయంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మయూరా జయకుమార్‌ వద్ద 17 తూటాలను భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కోయంబత్తూరు వెళ్ళడానికి మయూరా జయకుమార్‌ విమానాశ్రయం చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన లగేజీని విమా నాశ్రయ భద్రతాదళ అధికారులు తనిఖీ చేశారు. జయకుమార్‌ వద్ద ఓ సంచిలోని వస్తువులను అధికారులు తనిఖీ చేయగా, అందులో 17 తూటాలు లభించడంతో షాక్ అయ్యారు.

వెంటనే ఆయనను విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించ‌గా తనకు తుపాకీ లైసెన్స్‌ వుందని, తూటాలను భద్రపరచిన సంచిని కోయం బత్తూరు బయల్దేరే సమయంలో తెలియకుండా తీసుకువచ్చానని జయకుమార్‌ పోలీసులకు వివరణ ఇచ్చారు. ఆ త‌ర్వాత పోలీసులు దీనిపై లోతుగా విచార‌ణ చేశారు. విమానాశ్రయ అధికారుల విచారణలో ఆయనకు తుపాకీ లైసెన్స్‌ ఉన్నట్ట్లు తెలిసింది. దీంతో అనంత‌రం ఆయ‌న్ను పోలీసులు విడిచి పెట్టారు. సాదార‌ణంగా విమానాశ్ర‌యానికి వెళ్లే ఎవ‌రైనా అన్ని భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా బుల్లెట్లు తీసుకెళ్ల‌డంతో అక్క‌డ సిబ్బంది ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంతా అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here