క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో భారత్ కీల‌క నిర్ణ‌యం..

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. భార‌త్ బ‌యోటెక్ సంస్థ భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లితో కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ వ‌చ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు.

ఈ వ్యాక్సిన్‌కు ఇప్పుడు మొదటి ద‌శ ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయి. రెండో ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న తరుణంలో వీళ్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మామూలుగా తొలిద‌శ ప్ర‌యోగాలు 350 మందితో నిర్వ‌హించారు. ఇక రెండో ద‌శ‌లో ముందుగా చెప్పుకున్న విధంగా 750 మంది వాలంటీర్ల‌పై నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ఈ నిర్ణ‌యాన్ని మార్చుకొని 380 మందికి రెండో ద‌శ‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

రెండో ద‌శ ప్రయోగాలు కూడా త్వ‌ర‌గా పూర్తి చేసి మూడో ద‌శ ప్ర‌యోగాలు చేపట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన మొద‌టి ద‌శ‌లో ప్ర‌యోగాలు విజ‌య‌వంతం అయ్యాయి. ఇక రెండో ద‌శ ప్ర‌యోగాలు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చేసినవి బాగున్నాయి. ఈ రెండు ప్ర‌యోగాల్లో ఫ‌లితం పాజిటివ్‌గానే ఉంది. దీంతో ఈ సంఖ్య‌ను త‌గ్గించాల‌ని అనుకుంటున్నారు. మూడో ద‌శ ప్ర‌యోగాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ స‌మాచారంతో కూడిన ఓ వార్త‌ను ఇంగ్లీష్ పేప‌ర్ ప్రచురించింది. అయితే ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం వ‌చ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. కాగా తుది ద‌శ ప్ర‌యోగాల‌కు సంబంధించి అన్ని అనుమ‌తులు కూడా తీసుకున్నారు. వ్యాక్సిన్ వ‌చ్చాక ఎలా స‌ర‌ఫ‌రా చేయాల‌న్న దానిపై కేంద్రం స‌మాలోచ‌న‌లు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here