హాట్‌ ఫొటోల ట్రోలింగ్‌పై స్పందించిన ప్రియా..!

ఒక చిన్న కన్ను గీటి ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది అందాల నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. చేసినవి కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఇటీవల తన హాట్‌ నెస్‌ను పెంచిన ఈ బ్యూటీ హాట్‌ హాట్‌ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన హాట్‌ ఫొటోలపై ప్రియా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా కామెంట్లు చేశారు.

అయితే ఎట్టకేలకు ఈ కామెంట్లపై స్పందించిన ప్రియా.. తన ఫొటోలపై కొందరు చేసిన కామెంట్లను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇవి నా ఫొటోలకు వచ్చిన కామెంట్లు.. నేను వీటిలో పావు వంతు కూడా చూడలేకపోయాను. నేను మొదటి నుంచి ఇలాంటి వాటిని ఎదుర్కొంటున్నా. అవన్నీ దాటుకునే ఇక్కడి వరకు వచ్చాను. ఏదేమైనా అందరితోనూ దయగా, గౌరవంగా ప్రవర్తించాలని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. రోజూ ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటూనే ఇంత దూరం వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. ప్రతి స్త్రీ ఇలాగే ఉండాలి`అని చెప్పుకొచ్చింది ప్రియ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here