ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు ఎందుకు ఈడ్చుకెళ్లిందో తెలుసా..

ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా ఓ పెద్ద తప్పు జ‌రిగిపోయింది. ఫైన్ క‌ట్టాల్సి వ‌స్తోంద‌న్న కార‌ణంగా ఏకంగా కానిస్టేబుల్‌పైనే కారు ఎక్కించాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. అస‌లేమైందంటే..

ఢిల్లీలోని దౌలాకావున్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఓ కానిస్టేబుల్ అటువైపు నుంచి వ‌స్తున్న ఓ కారును ఆప‌బోయాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి త‌ప్పించుకునే ప్రయత్నంలో ఓ కారు డ్రైవ‌ర్ బరితెగించాడు. వాహ‌నాన్ని ఆపిన ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కారుతో బలంగా ఢీకొట్టి, కారును వేగంగా ముందుకు పోనిచ్చేప్రయత్నం చేశాడు. అయితే కారులో ఉన్న ఆ డ్రైవ‌ర్ దిగివ‌స్తాడ‌ని ట్రాఫిక్ కానిస్టేబుల్ భావించాడు. కానీ ఆ డ్రైవర్ కారును త‌న మీదకు ఎక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. వెంట‌నే తేరుకొని కారు బానెట్‌ను ప‌ట్టుకొని జాగ్రత్తగా ఉన్నాడు.

కొద్ది దూరం వెళ్లాక కానిస్టేబుల్‌ కింద‌ప‌డిపోయాడు. దీంతో వెంట‌నే కారు డ్రైవ‌వ‌ర్ వేగంగా వెళ్లిపోయాడు. స‌మీపాన ఉన్న సీసీ కెమెరాల్లో ఇది రికార్డు అయ్యింది. ఎట్ట‌కేల‌కు పోలీసులు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఇది ఇప్పుడు బాగా చక్క‌ర్లు కొడుతోంది. ఇలాంటి ఆక‌తాయిల నుంచి పోలీసులు జాగ్ర‌త్త‌గా ఉండాలని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here