పెళ్లికి ముందే ఎంజాయ్‌ చేయ్‌..

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెగా అభిమానులతోపాటు సినీతారలు కూడా తేజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా స్టార్‌ చిరంజీవి కూడా సాయి ధరమ్‌ తేజ్‌కు కాస్త వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తేజ్‌ ప్రస్తుతం ‘సోలో బతుకే సో బెటర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘అమృత’ అనే బ్రేకప్‌ పాటను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్వీ్‌ట్‌ చేసిన మెగాస్టార్‌.. ‘హ్యపీ బర్త్‌ డే ప్రియమైన సాయితేజ్‌. ‘సోలో’గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్‌ చేయ్‌. నీ బ్యాచిలర్‌ లైఫ్‌ ఇంకొన్ని రోజులే’నని ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here