మాస్క్ లేకుండా లోప‌లికి వెళ్లాల‌నుకుంటే డోర్స్ ఓపెన్ అవ్వ‌ట్లేదు..

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఎలాగైనా క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే  ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా మాస్క్ పెట్టుకోవాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని చెబుతున్నారు.

అయితే మాస్క్ పెట్టుకోవాల‌ని చెబుతున్నా చాలా మంది పెట్టుకోవ‌డం లేదు. వీరి వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని భ‌యాందోళ‌న నెల‌కొంది. ఈ ప‌రిస్థితుల్లో నో మాస్క్ నో ఎంట్రీ అని నిబంధ‌న‌లు కూడా పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఇవి మాత్రం పూర్తి స్థాయిలో అమ‌లు కావ‌డం లేదు. దీంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వం కొత్త మార్గాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా మాస్క్ లేని వారు ఏం చేసినా లోప‌లికి మాత్రం ప్ర‌వ‌శించ‌లేరు. దీంతో క‌రోనాని క‌ట్టడి చేసేందుకు త‌మ వంతు భాద్య‌తగా ఉంటున్నామ‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ ఏంచేశారంటే.. ఏఐ మానిటర్ అనే ఒక ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరాని తీసుకొచ్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఈ) సాయంతో పనిచేస్తుంది. మాల్‌లోకి వచ్చేవారు మాస్క్ పెట్టుకున్నారా లేదా అనే దానిని ఇది గమనిస్తుంది. మాస్క్ ధరించిన వినియోగదారులు వచ్చినపుడు మాత్రమే బయటనున్న గ్రీన్ లైట్ వెలిగి, మాల్ డోర్స్ తెరుచుకుంటాయి. ఈ సిస్టంను అన్ని మాల్స్‌లో ఏర్పాటు చేసేలా చూడాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చింది. కాగా మాల్స్ య‌జ‌మానులు మాట్లాడుతూ మాస్క్ లేకుండా వచ్చే వినియోగదారులకు అభ్యంతరం చెబితే వారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అటువంటివారిని నియంత్రించేందుకు ఏఐ మానిటర్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ విధానం వలన సత్ఫలితాలు ఉంటాయని వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here