బార్లు తెరిచారు.. ఆల‌యాల‌ను లాక్‌డౌన్‌లో ఉంచారు..

క‌రోనా విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించి వ్యాపార స‌మూదాయాలు ఓపెన్ చేస్తున్నాయి. దీని వల్ల ప‌బ్లిక్ కూడా కొంచెం ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసి ఆల‌యాలు మూసివేడ‌యం వివాదాస్ప‌దం అవుతోంది.

ప్ర‌స్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేశారు. ఇప్ప‌టికే ప‌లువురు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. ఇక ప‌లు ప్ర‌భుత్వాలు బార్లు, బీచ్‌లు ఓపెన్ చేశాయి. ఇదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా కట్ట‌డికి అన్ని విధాలా కృషి చేస్తోంది. అక్క‌డ కేసులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతోంది. ఇదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే మాట్లాడుతూ రానున్న పండుగ‌ల సీజ‌న్‌ను దృష్టిలో పెట్టుకొని ఆల‌యాలు ఓపెన్ చేయ‌డం లేద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంతా క‌రోనా క‌ట్ట‌డికి స‌హ‌క‌రించాల‌ని చెప్పారు.

మాస్క్ పెట్టుకుంటారా లేక లాక్‌డౌన్ విధించాలా అని ఆయ‌న ప్ర‌జ‌లే డిసైడ్ చేసుకోవాల‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో ఆల‌యాలు ఓపెన్ చేయ‌డం లేద‌ని చెప్పారు. ఈ విష‌యంపై గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ స్పందించారు. బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లు తెరిచార‌ని అయితే ఇదే స‌మ‌యంలో ఆల‌యాలు మూసి దేవుళ్ల‌కు లాక్‌డౌన్ విధించార‌ని అన్నారు. మీకేమైనా భ‌గ‌వంతుని నుంచి ఆదేశాలు అందాయా అని అన్నారు. దీంతో సీఎం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచిన‌ట్లు అయ్యింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఓ ఇంట‌ర్వూలో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ ఆ ప‌దాలను ఉప‌యోగించ‌కుండా ఉండాల్సింద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌రి ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here