క‌రోనా రెండో సారి వ‌స్తే ఇక అంతేనా..

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ గురించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. క‌రోనా సోకిన వారు కోలుకుంటున్నార‌న్న గుడ్ న్యూస్ మంచిదే అయినా. ఆ త‌ర్వాత విప‌రీత‌మైన దుష్ప‌లితాలు వెంటాడుతాయ‌ని తెలుస్తోంది. ఒక్కసారి క‌రోనా వ‌స్తే ఇక ఎన్నిసార్లైనా సోకుతుంద‌న్న భ‌యం ఇప్పుడు ఎక్కువైంది.

క‌రోనా సోకిన వారు ఆ త‌ర్వాత కూడా ముందుకంటే ఎక్కువ‌గా జాగ్ర‌త్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. క‌రోనా సోకిన వారు రోగ‌నిరోధ‌క శక్తి వ‌ల్ల త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు. అయితే ఆ త‌ర్వాత నెల రోజుల త‌ర్వాత క‌రోనా రెండోసారి విజృంభిస్తుందంట‌. మొద‌టి సారి వ‌చ్చిన దానికంటే రెండో సారి సోకిన స‌మ‌యంలోనే తీవ్ర ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. దీని గురించి ప‌రిశోధ‌న‌లు చేసిన అమెరికా శాస్త్ర‌వేత్త‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

25 ఏళ్ల యువ‌కుడికి ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికీ రెండో సారి 48 రోజుల త‌ర్వాత క‌రోనా సోకింది. రెండోసారి ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. దీని ద్వారా జ్వ‌రం, త‌ల‌నొప్పి, ద‌గ్గు,ఒళ్లు తిప్ప‌డం, డ‌యేరియా వంటికి విరుచుకుప‌డ్డాయి. మొద‌టిసారి హోం క్వారంటైన్‌లో ఉండి త‌గ్గిపోయిన క‌రోనా రెండోసారి మాత్రం హాస్పిట‌ల్‌కు వెళ్లి ఆక్సిజ‌న్ పెట్టించుకునే స్థాయి వ‌ర‌కు వెళ్లింది. దీన్ని బ‌ట్టి ఒక్క‌సారి క‌రోనా సోకిన వారు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. కాగా రెండోపారి క‌రోనా సోకిన వారిలో ఈ తీవ్ర ఇన్‌ఫెక్ష‌న్ ఎందుకు వ‌స్తుంద‌న్న‌ది ఇంకా తెలియాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీన్ని బ‌ట్టి క‌రోనా గురించి ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here