సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌లేద‌ని బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదు.. మోదీ ఏమంటారో..

క‌రోనా ఓ వైపు విల‌య‌తాండవం చేస్తున్నా దేశంలో ఎన్నిక‌ల సంద‌డికి మాత్రం బ్రేక్ ప‌డ‌లేదు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు దాదాపుగా స‌డ‌లించేశారు. ఈ త‌రుణంలో బీహార్‌లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది అయితే సామాజిక దూరం పాటించ‌కుండా అంద‌రూ ఒకే చోట‌కు చేర‌డంతో క‌రోనా విజృంభిస్తుంద‌ని ఆందోళ‌న ఎక్కువైంది.

బీహార్‌లో తొలి ద‌శ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారం ఊపందుకుంది. బీహార్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ నేత‌లు క‌రోనా నిబంధ‌నలు ఉల్లంఘించార‌ని తెలుస్తోంది. గయ జిల్లాలోగల గాంధీ మైదానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సామాజిక దూరాన్ని విస్మరించారు. ఎన్నిక‌ల ప్రాచారానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో పెట్టారు. దీంట్లో సామాజిక దూరం లేద‌న్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో బీజేపీ నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీనిపై విచార‌ణ చేయాల‌ని ఎస్డీఓ ఇంద్రీవీర్ అధికారుల‌ను ఆదేశించారు.

బీహార్ స‌భ‌లో పాల్గొన్న వ్య‌క్తి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అయినందువ‌ల్ల ఈ కేసు ఏమ‌వుతుందోన‌ని సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్ మొద‌లైంది. పోలీసులు స‌భ నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేశారు. దీనికి సంబంధించిన వారంద‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. అయితే బీజేపీ నేత‌లు ఒక‌రికి చెప్పాల్సింది పోయి వారే సామాజిక దూరం పాటించ‌కుండా ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించ‌డం ఏంట‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మోదీ నిబంధ‌న‌ల గురించి అంత చెబుతున్నా బీజేపీ నేత‌ల‌కు అర్థం కావ‌డం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here