ర‌ష్యా రెండో వ్యాక్సిన్‌పై భారీ అంచ‌నాలు..

క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను మొట్ట‌మొద‌టి సారిగా క‌నిపెట్టి ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన ర‌ష్యా మ‌రోసారి ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. రెండో వ్యాక్సిన్‌ను త‌యారుచేసేందుకు ఇప్పుడు ర‌ష్యా పూర్తి స్థాయిలో ముందుకు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అంద‌రి దృష్టీ మ‌ళ్లీ ర‌ష్యా వైపే ఉంది.

క‌రోనా వైర‌స్‌కు ర‌ష్యా స్నుతిక్ వి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు కూడ జ‌రుగుతున్నాయి. అయితే ఇంత‌వ‌ర‌కు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ వివ‌రాలు మాత్రం ర‌ష్యా బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. దీంతో స్నుతిక్ వి వ్యాక్సిన్‌పై డాక్ట‌ర్లు సందేహాలు వ్య‌క్తం చేశారు. అయితే స్నుతిక్ వి వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ఇండియాలో కూడా జ‌రుగ‌నున్నాయి. డాక్ట‌ర్ రెడ్డీస్‌తో ఈ మేర‌కు ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.

అయితే ఇప్పుడు ర‌ష్యా మ‌రో వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. నెల రోజుల నుంచే దీనిపై క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. ఇప్పుడు ఈ రెండో వ్యాక్సిన్‌ను రిజిస్ట‌ర్ చేయాల‌ని చూస్తోంద‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 15న దీన్ని రిజిస్ట‌ర్ చేయ‌నున్న‌ట్లు త‌యారీ సంస్థ ప్ర‌క‌టించింది. అయితే ర‌ష్యా గుట్టుచ‌ప్పుడు కాకుండా వ్యాక్సిన్లు క‌నిపెట్టేస్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. కాగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తే ప్ర‌పంచానికి మేలే జ‌రుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట పెట్టాల‌ని కోరుతున్నారు.

వ్యాక్సిన్ స‌మ‌ర్ధ‌త ఎంతో తెలియ‌కుండా దీన్ని ఎలా వాడ‌తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ర‌ష్యా ఈ రెండో వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ వివ‌రాలు అయినా బహిర్గ‌తం చేస్తుందో లేదో వేచి చూడాలి. కాగా స్నుతిక్ వి మూడో ద‌శ ప్ర‌యోగాలు ఇండియాలో జ‌రిగిన అనంత‌రం ఇండియాలో 10కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చేందుకు డాక్ట‌ర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఏడాది చివ‌రి నాటికి వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here