బులెటిన్ రిలీజ్ చేయమని తెలంగాణకు హైకోర్టు ఆదేశం..!

ఎన్నో అడ్డంకుల సచివాలయం అనంతరం కూల్చివేతకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సచివాలయం కూల్చివేతల్లో మీడియాకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కూల్చివేత జరిగే చోటుకు మీడియాను ఎందుకు అనుమతించడంలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అడ్వకేట్ జనరల్ ‘సెక్షన్ 180ఈ ప్రకారం సైట్‌లో పని చేసేవారు మాత్రమే ఉండాలని అందుకే మీడియాను అనుమతించదం లేదని’ కోర్టుకు వివరించారు. అయితే సచివాలయ కూల్చివేతలలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారో తెలపాలని, కరోనా కేసులకు సంబంధించిన బులెటిన్‌లను ఏ విధంగా విడుదల చేస్తున్నారో, అదే మాదిరి సచివాలయ కూల్చివేతలపై కూడా ఒక బులిటెన్ విడుదల చేయమని అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై రేపటిలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here