బీసీల కోసం సినిమాలు వదిలేస్తా అంటున్న హీరో సుమన్

బీసీల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఈ క్రమంలో అవసరమైతే సినీ రంగాన్ని కూడా వదులుకుని వస్తానని సినీ నటుడు సుమన్ అన్నారు. బీసీ బిల్లు కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసికట్టుగా పార్లమెంటులో పోరాడాలని ఆయన సూచించారు. బీసీ బిల్లును పార్లమెంటు ఆమోదించాలని అన్నారు.

బీసీ జాతి అభ్యున్నతి కోసం ఎజెండాను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.  హైదరాబాదులో జరిగిన ‘బీసీ విద్యార్థి గర్జన’కు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, బీసీలకు రాయితీలు కాదు, రాజ్యాధికారం కావాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here