ప‌బ్ జీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌..

ప‌బ్ జీ అభిమానులు పండుగ చేసుకునే ఓ గుడ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అనూహ్యంగా నిషేధానికి గురైన ప‌బ్ జీని మ‌ళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ మేర‌కు ద‌క్షిణ కొరియా సంస్థ క్రాఫ్ట‌న్ స‌మాచారం అందించింది.

భార‌త్, చైనా మ‌ధ్య నెల‌కొన్న పరిస్థితుల కార‌ణంగా 117 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. గూగుల్ స్టోర్, యాపిల్ స్టోర్‌ల నుంచి ప‌బ్ జీని తొల‌గించారు. దీంతో ప‌బ్ జీ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఇండియా మొత్తంలో 170 బిలియ‌న్ల డౌన్‌లోడ్‌లు ప‌బ్ జీకి ఉన్నాయి. ఇండియాలో యువ‌త ప‌బ్ జీతోనే టైం పాస్ చేస్తున్నారు. దీన్ని ఒక వ్య‌స‌నంగా మార్చుకున్నార‌ని త‌ల్లిదండ్రులు ఎంతో ఆవేధ‌న చెందుతున్న విష‌యం తెలిసిందే. మొత్తానికి చైనా విభేదాల నేప‌థ్యంలో దీన్ని తొల‌గించినా మ‌ళ్లీ ఇప్పుడు అందుబాటులోనికి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

దీంతో ప‌బ్ జీ అభిమానులు మ‌ళ్లీ పండుగ చేసుకుంటున్నారు. ప‌బ్ జీ వ‌స్తుంద‌న్న వార్త తెలియ‌గానే సంతోషంలో మునిగిపోయారు. దీనిపై క్రాఫ్ట‌న్ గేమింగ్ కంపెనీ కార్య‌చ‌ర‌ణ ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ స‌హాయంతో ప‌బ్ జీ మ‌ళ్లీ రానుంది. ఈ సంద‌ర్బంగా స‌మాచార భ‌ద్ర‌త‌, ప్రైవ‌సీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్య‌లు తీసుకుంటున్నారు. మ‌రో రెండు నెల‌ల్లోపు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప‌బ్ జీకి సంబంధించిన హ‌క్కులు ప‌బ్ జీ క్రాప్‌కు ద‌క్కాయి. దీంతో ఇప్ప‌టి నుంచే దీనికి సంబంధించిన మార్కెటింగ్ ప‌నులు చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏదిఏమైనా మ‌రి కొద్ది రోజుల్లోనే ప‌బ్ జీ అందుబాటులోకి వ‌స్తుంద‌న్న గుడ్ న్యూస్ ఇప్పుడు వినియోగ‌దారుల‌కు సంతోషాన్ని ఇస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here