అమెరికాలో ఎవ‌రు గెలుస్తారో 40 ఏళ్లుగా ఈయ‌న జోస్యం చెబుతున్నారు..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై ఇంత‌వ‌ర‌కు ఉత్కంఠ‌త నెల‌కొంది. అయ‌తే ఒకాయ‌న మాత్రం ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో త‌మ‌కు ముందే తెలుసు కాబ్ట‌టి హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చాక అంద‌రి దృష్టీ ఆయ‌న‌పైనే ఉంది.

ఆయన పేరు అలన్ లిచ్ట్మాన్. ఈయ‌న అమెరికన్ యూనిర్సిటీ ప్రొఫెసర్. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై ఈయ‌న ముందే జోస్యం చెబుతున్నారు. ఈయ‌న చెప్పిందే ఇప్ప‌టికీ జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే 13 సూత్రాల ఆధారంగా ఈసారి ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధిస్తారని ఆగస్టులోనే లిచ్ట్మాన్ జోస్యం చెప్పారు. కాగా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించి.. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా హిల్లరి క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధిస్తారని లిచ్ట్మాన్ ముందే ప్రకటించారు.

ఈ క్రమంలో అమెరికన్ యూనివర్సిటీ పొఫ్రెసర్ పేరు అగ్రరాజ్యంలో మారు మోగుతోంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి నిజమయ్యాయని అమెరికన్లు చర్చించుకుంటున్నారు. హార్వర్డ్, బ్రాండీస్ యూనిర్సిటీల్లో చదువు పూర్తి చేసుకున్న ఈయన వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. 2006 ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున మేరీలాండ్ నుంచి సెనేట్‌కు పోటీ చేశారు. కాగా ఇదే ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధిస్తార‌ని ఇండియాకు చెందిన ఓ వ్య‌క్తి కూడా జోస్యం చెప్పారు. అయితే అవేమీ నిజం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here