సినిమా త‌ర‌హాలో పోలీస్‌ను ట్రాక్ట‌ర్‌తో ఢీకొట్టి చంపేసిన దుండ‌గులు..

అచ్చం సినిమాలో జ‌రిగినట్లే అక్ర‌మాల‌ను అడ్డుకుంటున్న పోలీస్‌ను దుండ‌గులు చంపేశారు. అక్ర‌మంగా ఇసుక‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న ఓ ముఠాను పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. దుండ‌గులు ట్రాక్ట‌ర్‌తో గుద్ది చంపేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

ఆగ్రా స‌మీపంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఈ ప్రాంతంలో అక్ర‌మ ఇసుక ర‌వాణా జ‌రుగుతోంది. ఇసుక మాఫియా పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంద‌న్న స‌మాచారం అంద‌రికీ తెలుసు. దీంతో ఆదివారం ఈ ప్రాంతంలో ట్రాక్ట‌ర్ల‌లో అక్ర‌మార్కులు ఇసుక‌ను త‌రలిస్తున్నారు. ఈ విష‌యం స్థానికంగా ఉన్న కానిస్టేబుల్ గ‌మ‌నించారు. వెంట‌నే ట్రాక్ట‌ర్ల‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ట్రాక్ట‌ర్‌ను ఓవ‌ర్ టెక్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఇసుక అక్ర‌మార్కులు ట్రాక్ట‌ర్‌తో బైక్‌ను గుద్ది కానిస్టేబుల్‌పై ట్రాక్ట‌ర్‌ను ముందుకు తీసుకెళ్లారు.

ఈ ప్ర‌మాదంలో కానిస్టేబుల్ చ‌నిపోయారు. అనంతరం దుండగులు ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపారు. అక్ర‌మ మైనింగ్ అడ్డుకుంటున్న పోలీస్ మ‌ర‌ణించ‌డం జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. కాగా ఈ ప్రాంతంలో అధికార యంత్రాంగం కళ్లు కప్పి రాత్రుళ్లు, అడ్డదార్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికుల నుంచి కూడా ఈ విషయమై అనేక ఫిర్యాదులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here