పెళ్లంటే చాలా భ‌యం కానీ ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నా..

అంద‌రి అమ్మాయిల్లాగే సెల‌బ్రెటీలకు కూడా ఒక ర‌క‌మైన భావ‌న ఉంటుందా అంటే అవున‌నే అనుకోవ‌చ్చు. ఎందుకంటే ప్రియాంకా చోప్రా చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి సెల‌బ్రెటీలైన ఎవ‌రైనా వారిలోని సందేహాలు, భ‌యాలు ఒక్క‌లాగే ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ప్రియాంకా చోప్రా ప‌లు విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. త‌న‌కు పెళ్లంటే చాలా భ‌య‌మ‌ని చెప్పారు. అయితే త‌న‌కు చిన్న‌ప్పుడు పెళ్లి అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పొకొచ్చారు. అయితే త‌న‌కు 20 సంవ‌త్స‌రాలు ఉన్న స‌మ‌యంలో పెళ్లి అనే టాపిక్ వ‌స్తే చాలా భ‌య‌ప‌డేదాన్ని అంటారు. అయితే మంచి వ్య‌క్తిని ఎంచుకుంటానో లేదో అన్న భ‌య‌మే ఎక్కువ‌గా ఉండేద‌ని చెప్పింది. కాగా స‌రైన వ్య‌క్తి జీవితంలోకి వ‌స్తే పెళ్లి గురించి భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతోంది ప్రియాంక చోప్రా. పెళ్లంటే భ‌య‌ప‌డిన ఈమె నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈయ‌న ప‌రిచ‌యం అయిన త‌ర్వాత త‌న‌లోని భ‌యం మొత్తం మాయ‌మైంద‌ని చెబుతోంది. ఇప్పుడు జీవితం సంతోషంగా ఉంద‌ని అంటోంది ప్రియాంక చోప్రా. కాగా నిక్‌ను ప్రేమించినా పెద్ద‌ల‌కు చెప్పి వివాహం చేసుకున్నారు ఈమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here