అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌కు ఇండియాలో బంధువులు ఎక్క‌డో ఉన్నారో తెలుసా..

అగ్ర‌దేశం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించారు. నిన్న‌టి వ‌ర‌కు అమెరికాతో పాటు ఇండియా కూడా ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చింది. అయితే ఇప్పుడు జో బైడెన్ ఇండియాతో ఎలా మెలుగుతార‌న్న దానిపై చ‌ర్చ న‌డుస్తోంది.

భార‌త్‌కు అమెరికా ఇప్ప‌టివ‌ర‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వ‌చ్చాక ఎలా ఉంటార‌న్న దానిపై అంద‌రూ ఆలోచిస్తున్నారు. అయితే జో బైడెన్‌కు ఇండియాతో మంచి రిలేష‌న్ ఉంది. ముంబైలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ 2015లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాషింగ్టన్‌లో చెప్పారు. 1972లో తాను అమెరికా సెనేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబై నుంచి బైడెన్‌ పేరుతో ఒక లేఖ వచ్చిందని గుర్తు చేశారు. అయితే, దాన్ని తాను పట్టించుకోలేదని తెలిపారు. 2013లో ఉపాధ్యక్షుడి హోదాలో ముంబైలో పర్యటించానని, అప్పుడు తన వారసుల కోసం వాకబు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు. ఆరు తరాల క్రితం తన ముత్తాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరఫున ముంబైలో పని చేశారని గుర్తు చేసుకున్నారు.

భారత్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. బహుశా వారి వారసులే తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. బైడెన్‌ వారసులు ఎవరైనా ఉంటే తనకు సమాచారం అందించాలని బైడెన్‌ నాడు కోరారు. ఇప్పుడు అగ్ర‌రాజ్య అధినేత‌గా బైడెన్ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వార‌సులు ఇండియాలో ఎక్క‌డైనా ఉన్నారా అన్న దానిపై దృష్టి సారించే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు సంబంధించిన వారు ఉండే ఉంటారు. వారు లేక‌పోయినా వారి వార‌సులైనా ఉంటారు. మొత్తానికి ఇండియాలో బైడెన్ బంధుత్వం ఉంటుంద‌న్న ఆశ‌లైతే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బైడెన్ ఇండియాతో ఇప్ప‌టికేంటే ఇంకా మంచి స్నేహ బంధం కొన‌సాగించొచ్చ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here