హైద‌రాబాద్‌లో ఏ రూట్లో వెళ్లాలో ఒక్క‌సారి తెలుసుకోండి..

దంచికొడుతున్న వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అయ్యింది. దీంతో ఇప్ప‌టి నుంచి మూడు రోజుల పాటు అత్య‌వ‌స‌రం అయితేనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచ‌న‌లు జారీ చేశారు. పైగా సెలువులు కూడా ప్ర‌క‌టించింది ప్రభుత్వం.

ఈ రోజు రేపు రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లకు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ప్ర‌జ‌లు ఇంట్లోనే ఉండాల‌ని సూచించింది. ఇక లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అవ్వ‌డంతో అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ముగినిపోయారు. ఇక ప్రధానంగా రోడ్ల‌పై ఓ ప‌క్క నీరు మ‌రో ప‌క్క వాహ‌నాల‌తో ప‌రిస్థితి అత‌లాకుత‌లం అయ్యింది. దీంతో అధికారులు ఎక్క‌డ‌కు ఎలా వెళ్లాలో ప్ర‌త్యేకంగా రూట్ మ్యాప్ ఇచ్చారు.

హైద‌రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బెంగుళూరు, క‌ర్నూలు వైపు వెళ్లేందుకు నేరుగా రోడ్డు మార్గం లేదు. శంషాబాద్ స‌మీపంలో రోడ్డు పూర్తిగా దెబ్బ‌తింది. దీంతో అటు వైపుగా వెళ్లాలని అనుకునే వారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి. ఇక మొహిదీప‌ట్నం నుంచి గ‌చ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌక్ ఫ్లై ఓవ‌ర్ మీదుగా వెళ్ల‌కూడ‌దు. సెవెన్ టూంబ్స్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక మ‌ల‌క్‌పేట వ‌ద్ద నాలా పూర్తిగా పొంగ‌డంతో మ‌ల‌క్‌పేట ఎల్బీన‌గ‌ర్ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో పాటు మ‌ల‌క్‌పేట ఆర్‌యూబీ రోడ్ కూడా బ్లాక్ అయ్యింది.

దీంతో ఇలా వ‌చ్చే వారు వేరే రోడ్లు చూసుకోవాల‌ని చెబుతున్నారు. ఇక మూసీ ఉప్పొంగ‌డంతో మూసారాం బాగ్‌ బ్రిడ్జి ద‌గ్గ‌ర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్ర‌యాణీకులు స‌మ‌చారం తెలుసుకొని బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. ఈ మేర‌కు ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here