అతడు తాప్సీ జతగాడేనా.?

ఝుమ్మంది నాధం సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల నటి తాప్సీ. అనంతరం తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మంచి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక సౌత్‌ ఇండియాలో పెద్దగా కమర్షియల్‌ విజయాలను అందుకోలేకపోయిన తాప్సీ బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మాత్రం తనదైన తీరులో దూసుకెళ్లింది. పింక్‌, బద్లా, తప్పడ్ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన తాప్సీ బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాప్సీ డెన్మార్క్‌ కి చెందిన మతియాస్‌ బో అనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడితో ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై తాప్సీ ఏనాడూ అధికారికంగా స్పందించలేదు. కానీ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ ఫొటో.. తాప్సీ ప్రేమ వార్తలకు బలం చేకూర్చింది. తాప్సీ ప్రస్తుతం మాల్దీవుల్లో హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది. ఈ టూర్‌కి సంబంధించిన ఫొటోలను ఈ సొట్ట బుగ్గల చిన్నది ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. అయితే తాప్సీ షేర్‌ చేయని.. మతియాస్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మాల్దీవ్‌ టూర్‌కు మతియాస్‌ కూడా వెళ్లినట్లు ఈ ఫొటో స్పష్టం చేస్తోంది. దీంతో వీరి మధ్య నిజంగానే ఏదో బంధం ఉందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. మరి తాప్సీ త్వరలోనే పప్పన్నం పెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here