అక్క‌డ ప్ర‌తి రోజూ ముగ్గురు క‌రోనాతో చ‌నిపోతున్నారు..

క‌రోనా దేశంలో విజృంభిస్తూనే ఉంది. ప్ర‌ధానంగా దేశ రాజధాని ఢిల్లీలో క‌రోనా కేసులు తీవ్ర‌త ఎక్క‌వ‌గా ఉంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో చోటుచేసుకుంటున్న కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

న‌వంబ‌ర్ నెల ప్రారంభం నుంచి ఢిల్లీలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే క‌రోనాతో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజులుగా కోవిడ్ బారినపడి గంటకు నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. న‌వంబ‌ర్ నెల‌లో మొద‌టి ప‌ది రోజుల్లో 1103 మంది క‌రోనాతో చ‌నిపోయారు. దీన్ని బ‌ట్టి అక్క‌డ క‌రోనా తీవ్ర‌త ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ప్రకారం ప్రతి రోజు 73.5 మరణాలు చేటుచేసుకున్నాయి. అంటే సరాసరి రోజుకు మూడు మరణాలు. నిజానికి, గత వారంలో సుమారు ప్రతి రోజూ 90 మరణాలు చోటుచేసుకోగా, ఒక్క గురువారంనాడు 104 మరణాలు, శనివారంనాడు 96 మరణాలు చోటుచేసుకున్నాయి.

ఢిల్లీలో ఆదివారం నాటికి మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 7,614గా ఉంది. క‌రోనా మ‌ర‌ణాలు ఢిల్లీలో ఒక్కో నెల‌లో ఒక్కో విధంగా ఉన్నాయి. ఓసారి మ‌ర‌ణాలు త‌గ్గిన‌ట్టు క‌నిపించినా మ‌రో నెల‌లో వెంట‌నే ఎక్కువ‌వుతున్నాయి. ఇక ఇప్పుడు శీతాకాలంలో ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంటుందని అంటున్నారు. పైగా ఢిల్లీలోని కాలుష్యం క‌రోనాను మ‌రింత రెట్టింపు చేస్తుంద‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here