స‌మంత ఒక్క రోజుకు అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారా..

సినీ రంగంలో దూసుకుపోతున్న స‌మంత త‌న క్రేజ్‌ను ఏమాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటోంది. ఇప్ప‌టికే అగ్ర హీరోయిన్ల జాబితాలో కొన‌సాగుతున్న ఈ అక్కినేని వారి కోడ‌లు ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డు సృష్టిస్తోంది. తెలుగు ఓటీటీ ఆహాలో సామ్‌ జామ్‌ అనే టాక్‌షోను సమంత అక్కినేని హోస్ట్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే సినిమాల్లోకంటే ఎక్కువ‌గా భారీ రెమ్యున‌రేష‌న్ ఈ షోల‌కు స‌మంత తీసుకుంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది. సమంత ఓ ఎపిసోడ్‌ పదిహేను లక్షల రూపాయలను ఛార్జ్‌ చేస్తుందట. ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్‌ను ప్లాన్‌ చేశారట. మొత్తంగా చూస్తే సమంతకు రూ.1.8 కోట్లు రెమ్యునరేషన్‌ దక్కే అవకాశం ఉంది. సినిమాల్లో అయితే ఎక్కువ రోజులు కేటాయించాల్సి వ‌స్తుంది. అదే ఓటీటీలో కేవ‌లం త‌క్కువ రోజుల‌కే ఇంత అమౌంట్ తీసుకోవ‌డం గ్రేట్ అంటున్నారు.

సినిమా చేయాలంటే యాబై నుండి అరవై రోజుల కాల్షీట్స్‌ను కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఈ టాక్‌ షోకు పన్నెండు రోజుల సమయం కేటాయిస్తే చాలు. ఓటీటీ బాగా పాపుల‌ర్ అవుతున్న రోజుల్లో స‌మంత ఇంత భారీ ప్యాకేజీ తీసుకోవ‌డం ప‌ట్ల అంతా షాక్ అవుతున్నారు. త‌న ట్యాలెంట్‌ను ఉప‌యోగించి సమంత క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా స‌మంత డిఫ‌రెంట్‌గా వ‌ర్క్ చేస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here