క‌రోనా గెల‌వాల‌ని కోరుకుంటున్న‌ది ఎవ‌రో తెలుసా..

ప్ర‌పంచంలో ఇప్పుడు క‌రోనా పేరు చెబితే భ‌య‌ప‌డ‌ని వారు ఉండ‌రు. ఎందుకంటే గ‌త ఆరు నెల‌ల కాలం నుంచి క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించేస్తోంది. అయితే ఆ ప్రాంత ప్ర‌జ‌లు మాత్రం క‌రోనా అంటే చాలా ఇష్టంగా చూస్తున్నారు. క‌రోనా గెల‌వాల‌ని కోరుకుంటున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. క‌రోనా అంటే మ‌నంద‌రికీ వైర‌స్ అని తెలుసు. కానీ వారికి మాత్రం ఓ వార్డుకు పోటీ చేస్తున్న అభ్య‌ర్థి. కేర‌ళ రాష్ట్రంలో వ‌చ్చే నెల‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కొల్లాం కార్పోరేష‌న్ పరిధిలోని మ‌థిలిల్ వార్డు నుంచి బీజేపీ త‌రుపున క‌రోనా థామ‌స్ అనే మ‌హిళ‌ పోటీ చేస్తున్నారు. ప్ర‌పంచానికి క‌రోనా అంటే వైర‌స్ కానీ వారికి మాత్రం ఆమె అభ్య‌ర్థి. ఇలాంటి విచిత్ర‌మైన పేరు ఉంద‌న్న విష‌యం ఇప్పుడిప్పుడే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసి వ‌చ్చింది. దీంతో అక్క‌డ ఆమెకు ఊహించ‌ని పాపులారిటీ వ‌చ్చేసింది.

అయితే క‌రోనా పేరు వ‌ల్ల త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని అంటున్నారు. అయితే ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ రావ‌డంతో త‌న పేరు ఈజీ అయిపోయింద‌ని చెబుతున్నారు. అప్ప‌ట్లో ప్ర‌చారానికి వెళితే అంత‌గా గుర్తుప‌ట్టేవారు కాద‌ని.. ఇప్పుడు ప్ర‌చారానికి వెళితే ప్ర‌జ‌లు ఈజీగా గుర్తుప‌డుతున్నార‌ని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను గుతుపెట్టుకొని ఓటేస్తార‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. మొత్తానికి క‌రోనా పేరు ఈమెకు మాత్రం బాగా క‌లిసి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here