జ‌న‌వ‌రికి వారంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్‌..

ప్ర‌పంచంలో కరోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంది. దీంతో ప‌లు దేశాల్లో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వాలు క‌రోనా వ్యాక్సిన్ పై దృష్టి సారించాయి. వీలైనంత త్వ‌ర‌గా క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అంద‌జేయాల‌ని ఆలోచిస్తున్నాయి. దీంతో మ‌రో రెండు నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు వేయించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. దీంతో అక్కడ దేశాలు ముందస్తు ఆంక్షలను విధించేస్తున్నాయి. వాటితో పాటు ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రజలకు త్వరితగతిన కరోనా వ్యాక్సిన్ అందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే అమెరికన్ సంస్థ పీఫైజర్‌తో కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. వృద్ధులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడే ప్రమాదం ఉన్న వారిని గుర్తించి వారందరికీ 2021 జనవరి చివరికల్లా వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమవుతోంది.

ఇందుకోసం మొత్తం 1.6 మిలియన్ల మంది ప్రజలకు అవసరమైన 3.4 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఇప్పటికే ఆర్డర్ చేసింది. ఈ డోసులు జనవరి రెండో వారంలో ఇటలీకి అందనున్నాయి. ఈ విషయాన్ని ఇటలీ వైరస్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రాం కమిషనర్‌ డొమెనికో అర్‌క్యూరీ తెలిపారు. అక్కడి నుంచి దాదాపు 8 నెలల్లోపు.. అంటే సెప్టెంబరు కల్లా దేశ జనాభాలో అత్యధికశాతం ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. అయితే పీఫైజర్‌తో పాటు ఇతర వ్యాక్సిన్ల వినియోగానికి ‘యురోపియన్‌ మెడికల్‌ ఏజెన్సీ’ నుంచి అనుమతి రావాల్సి ఉందని, దీనిపై సంస్థ ఆలోచించి అతి త్వరలో అనుమతులిస్తుందని భావిస్తున్నామని ఆర్‌క్యూరీ తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ విషయంలో ప్రజల ఆలోచనా సరళిపై కూడా తాము ముందునుంచే అధ్యయనం చేస్తున్నామని, వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తిగానే ఉన్నారని ఆ అధ్యయనంలో తేలినట్లు ఆర్‌క్యూరీ వెల్లడించారు. దీనికోసం అవసరమైన ఇంజక్షన్‌లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here