చైనా టార్గెట్ ఏంటి.. భార‌త్ ఎలా స్పందిస్తుంది..

చైనా భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు మ‌నం చూస్తూనే ఉన్నాం. లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం ముందుకొచ్చింది. దీంతో భారత సైన్యం వారిని నిలువరిస్తోంది. అటు వైపు భారత్‌ను కవ్విస్తూనే మరో వైపు భూటాన్‌లో ఆక్రమణలకు పాల్పడుతోంది. ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్ల మేర లోనికి చొచ్చుకెళ్లి ఓ భారీ సైజు గ్రామాన్నే నిర్మించేసింది.

ఈ గ్రామానికి పంగ్డా అని కూడా పేరు పెట్టేసింది. చైనా అధికారిక మీడియాలోని ఓ సీనియర్‌ పాత్రికేయుడు దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేయడంతో విషయం బట్టబయలైంది. అయితే ఈ ట్వీట్లు ఒక్కసారిగా వైరల్ కావడం, చైనా వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఆయన తన ట్వీట్లను తొలగించారు. కానీ అప్పటికే స్క్రీన్‌షాట్ల రూపంలో ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి. మూడేళ్ల క్రితం భూటాన్‌కు చెందిన డోక్లాం ప్రాంతంలోనే 72 రోజుల పాటు భారత్, చైనాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగింది.

ఆ తరువాత వాతావరణం సద్దుమణిగింది. చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం ముందుకొచ్చింది. దీంతో భారత సైన్యం వారిని నిలువరిస్తోంది. మరి దీనిపై భారత్ ఎంలాంటి చర్యలు తీసుకుంటుందో, భూటాన్‌కు ఏ విధంగా సాయం చేస్తుందో వేచి చూడాలి. చైనా ఆక్రమణ ధోరణిపై భారత రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూటాన్‌కు మిగతా దేశాలన్నీ అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను చూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వి దీనిపై స్పందించారు. ట్విటర్‌ వేదికగా చైనా సలామీ స్లైసింగ్‌కు భూటాన్‌ బాధిత దేశంగా మారిందని, సార్క్‌ సహా యావత్‌ ప్రపంచ దేశాలు ఈ విషయంలో భూటాన్‌కు అండగా ఉండాలని, చైనా విస్తరణ వాదాన్ని నియంత్రించాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here