మంత్రిపై క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌..

క‌రోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ ద‌శ‌లో అంద‌రూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూస్తున్నారు. ప్ర‌పంచంలో చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్ర‌యోగాల జ‌రుగుతున్నాయి. ప‌లు దేశాల్లో వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ తుది ద‌శ‌కు చేరుకున్నాయి.

మరో రెండు మూడు నెల‌ల్లో ప్ర‌పంచంలో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్న ఆశాభావం అంద‌రూ వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇండియా విష‌యానికొస్తే భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్జిన్ ట్ర‌య‌ల్స్ కూడా జోరందుకున్నాయి. తుది ద‌శ ఫ‌లితాలు మ‌రికొద్ది రోజుల్లోనే జ‌రుగ‌నున్నాయి. హర్యానా మంత్రి అనిల్ విజ్ పై కరోనా కోవ్యాక్సిన్ పరీక్షలు జరపనున్నారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ మూడో ట్రయల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కొందరు వాలెంటీర్లపై ఆ సంస్థ శుక్రవారం పరీక్షలు జరపనుంది. అందులో అనిల్ విజ్ ఒకరు.

ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. మూడో రౌండ్ లో దాదాపు 26,000 మందిపై పరీక్షలు జరపనున్నారు. అందులో నేనూ ఒకణ్ని అని అనిల్ విజ్ ప్రకటించారు. కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ హర్యానాలోని రోహ్‌తక్ నుంచి ప్రారంభం కానుంది. అందులో మొదటి టీకాను అనిల్ విజ్‌పై ప్రయోగించనున్నారు. ఒక మంత్రి క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యోగాల్లో వాలంటీర్‌గా పాల్గొంటున్నార‌న్న విష‌యం వైర‌ల్ అయ్యింది. ప్ర‌ముఖులు టీకా ప్ర‌యోగాల్లో పాల్గొన‌డం వ‌ల్ల‌ ప్ర‌జ‌ల్లో ఉన్న అన్ని ర‌కాల సందేహాలు తీరిపోతాయ‌ని ప‌లువురు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here