గోవా బీచ్‌కు వెళ్తున్నారా జాగ్ర‌త్త‌..

గోవా బీచ్‌కు వెళ్లే వారికి షాక్ త‌గిలింది. బీచ్‌లో జెల్లీ ఫిష్‌లు ప‌ర్యాట‌కుల‌ను భ‌య‌పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ప‌ర్య‌ట‌కులు ఆందోన‌కు గుర‌వుతున్నారు. సాదార‌ణంగా ఎంజాయ్ చేయ‌డానికి అంద‌రూ గోవా బీచ్‌కు ఎక్కువ‌గా వెళుతుంటారు. అయితే ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌రిణామాలు ప‌ర్యాట‌కుల‌ను భ‌య‌ప‌డుతున్నాయి.

గోవా బీచ్‌లో పర్యాటకులను జెల్లీ ఫిష్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో బీచ్‌కు చేరిన జెల్లీ ఫిష్‌లు.. నీటిలోకి దిగిన వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రెండు రోజులుగా జెల్లీ ఫిష్‌ల గుంపులు దాడి చేస్తుండడంతో దాదాపు 90 మందికి పైగా పర్యాటకులు గాయాలపాలయ్యారు. గోవా బీచ్‌ లైఫ్‌ గార్డ్ ఏజెన్సీ.. దృష్టి మరీన్ ఈ విషయాన్ని వెల్లడించింది. గోవాలోని బగ-కలంగుటే బీచ్‌లో జెల్లీ ఫిష్‌ల దాడివల్ల దాదాపు 55 మందికి గాయాల‌య్యాయి.

అలాగే కండోలిమ్ నుంచి సింకెరిమ్ బీచ్ వరకు 10 మంది, దక్షిణ గోవాలో 25 మంది జెల్లీ ఫిష్‌ల దాడిలో గాయపడినట్లు తెలిపింది. వీరందరికీ వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించామని చెప్పింది. గోవా బీచ్‌లో జెల్లీల దాడి విష‌యం తెలియ‌డంతో ప‌లువురు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే బీచ్‌లో కొన్ని చోట్ల మాత్ర‌మే ఇలా ఉంటుంద‌ని మిగ‌తా చోట్ల ఇవి లేవ‌ని కొంద‌రు చెబుతున్నారు. జెల్లీ ఫిష్‌లు ఎక్కువైతే పర్యాట‌కులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మ‌రి వీటి నుంచి ప‌ర్యాట‌కుల‌ను కాపాడేందుకు ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటారేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here