అమెరికాలో టిక్ టాక్ ఎప్పుడు వ‌స్తుందో తెలుసా..

అమెరికాలో టిక్‌టాక్‌కు ఊర‌ట ల‌భించింది. నవంబర్ 12వ తేదీలోగా అమెరికాలోని టిక్‌టాక్‌కు సంబంధించిన ఆస్తులను అమెరికా కంపెనీలకు అమ్మేయాలని ప్ర‌భుత్వం బైట్‌డ్యాన్స్‌కు సూచించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ గ‌డువును తాజాగా ప్రభుత్వం పెంచింది.

అయితే టిక్‌టాక్ ఆస్తుల‌ను అమ్మేయ‌డానికి బైట్‌డ్యాన్స్ నిరాకరిస్తే నవంబర్ 12 తర్వాత నిషేధాజ్జలు అమలులోకి వచ్చి అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయని గ‌తంలో ఆదేశాలు ఉన్నాయి. దీంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్.. ట్రంప్ ఆదేశాలపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ట్రంప్ సర్కార్ దిగొచ్చింది. టిక్‌టాక్ సంబంధించిన ఆస్తులను అమ్మేయడానికి గతంలో ఇచ్చిన గడువును 15 రోజులపాటు పొడిగించింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో టిక్‌టాక్ ఆస్తులను అమ్మేయడానికి వాల్‌మార్ట్, ఒరాకిల్ తదితర సంస్థలో బైట్‌డ్యాన్స్ చర్చలు జరుపుతోంది.

చైనా, అమెరికా మ‌ధ్య విద్వేషాలు ఎక్కువే అన్న విష‌యం తెలిసిందే. ఇవి క‌రోనా స‌మ‌యంలో మ‌రింత పెరిగిపోయాయి. క‌రోనా చైనా నుంచి వ‌చ్చింద‌ని ట్రంప్ ఎన్నోసార్లు అన్నారు. ఈ నేప‌థ్యంలో దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించి చైనా సంస్థ టిక్ టాక్ యాప్‌ను నిషేధిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ప‌రిస్థితుల్లో టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన సంస్థ‌ల‌కు అమ్మేయాల‌ని అప్ప‌ట్లో సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా అది జ‌రుగుతూనే ఉంది. ఈ వ్య‌వ‌హారం అంతా పూర్త‌య్యాక అమెరికాలో మ‌ళ్లీ టిక్‌టాక్ రానుంది. మ‌రి ఇండియాలో కూడా టిక్‌టాక్ విష‌యంలో సానుకూల నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేద‌ని టిక్‌టాక్ అభిమానులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here