ఏనుగు పుట్టిన‌రోజు వేడుక‌లు ఎలా చేశారంటే..

మామూలుగా మ‌నం పుట్టిన‌రోజు వేడుక‌లు వైభ‌వంగా చేసుకుంటాం. అదే పిల్ల‌ల బ‌ర్త్‌డేలైతే మ‌రింత పండుగ‌లా చేసుకుంటాం. కానీ ఓ ఏనుగు పిల్ల బ‌ర్త్‌డేను కూడా గ్రాండ్‌గా చేశారు. ఏనుగు కూడా సంద‌డి చేసింది.

కేరళలోని కొట్టూర్ ఎలిఫెట్ రీహాబిలిటేషన్ సెంటర్లో శ్రీ‌కుట్టి అనే చిన్న ఏనుగు బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిగాయి. ఏనుగు పిల్ల కేర‌ళ ఫారెస్టు అధికారుల‌కు క‌నిపించింది. దీని త‌ల్లి మొద‌ట్లోనే చ‌నిపోయింది. ఈ ఏనుగు పిల్ల‌ నీటిలో కొట్టుకుపోవడంతో శరీరమంతా గాయాలతో, ముందుకాళ్లు బాగా దెబ్బతిని కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో వీరికి దొరికింది. వెంట‌నే అధికారులు డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా బ్ర‌తికే అవ‌కాశం లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఓ డాక్ట‌ర్ దీన్ని బ్ర‌తికించి శ్రీ‌కుట్టి అనే పేరు పెట్టారు. ఇది వీరి వ‌ద్ద‌కు వ‌చ్చి సంవ‌త్స‌రం అయిన సంద‌ర్బంగా దీని బ‌ర్త్‌డే చేశారు.

ఓ పెద్దసైజు కేకును తయారుచేసి శ్రీకుట్టికి తినిపించారు. ఈ ఫంక్షన్‌కు శ్రీకుట్టితోపాటు మరో 15 ఏనుగు పిల్లలు కూడా వచ్చాయి. ఈ ఏనుగు పిల్లలు, మనుషుల మధ్య పెద్ద కేకు తిని బర్త్‌డే చేసేకుంది శ్రీకుట్టి. ఈ బ‌ర్త్‌డే వేడుకల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న ఏనుగు కాపాడిన డాక్ట‌ర్‌కు అంద‌రూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here