అమెరికా అధ్య‌క్షుడు ఎవ‌రు..?

అమెరికాలో అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో ఇంకా గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో జో బైడెన్ విజ‌యం సాధించార‌న్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ట్రంప్ మాత్రం త‌న పంతం వీడ‌డం లేదు. తానే అధ్య‌క్షుడిన‌ని అనుకుంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా.. ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచినట్లు తనకు తానే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నారు. అందుకోసం శ్వేతసౌధంలో ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయని వైట్‌హౌస్ సిబ్బంది పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో మీడియా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన చర్యలను వైట్‌హౌస్ తీసుకుంటుందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. జార్జియాలో బైడెన్, నార్త్ కరోలినా‌లో ట్రంప్ విజయం సాధించినట్లు శుక్రవారం రోజు అమెరికా మీడియా‌లో వార్తలొచ్చాయి. దీంతో జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇదే సమయంలో ట్రంప్‌.. 232 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నట్లు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here