ప్ర‌పంచ దేశాల‌కు ఇండియాకు తేడా ఏంటో తెలుసా..

ప్ర‌పంచంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించే ప‌నిలో ప‌డ్డారు. అయితే భార‌త్‌లో మాత్రం క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూ ఉండ‌టం మ‌న అదృష్ట‌మ‌నే చెప్పాలి.

గడచిన 24 గంటల్లో కొత్తగా 45,149 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 480 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 71,09,960 మంది కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో 71,37,229 మంది వ్యాధి నుంచి కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయంగా చెప్పవచ్చు. మొత్తం కరోనా మృతుల సంఖ్య విషయానికొస్తే ఇప్పటివరకూ కరోనాతో 1,19,014 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,53,717గా ఉంది. వీరంతా ప్రస్తుతం దేశంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా డెత్ రేటు ఒక శాతం తగ్గింది. పంజాబ్‌లో అత్యధికంగా 2.63శాతం డెత్ రేటు ఉండగా, మహారాష్ట్రలో 2.60 శాతం డెత్ రేటు ఉంది. మిజోరంలో ఒక్క కరోనా మృతి కూడా చోటుచేసుకోలేదు. అయితే ఇక్కడ మొత్తం 2,447 మంది కరోనా బారినపడ్డారు. మిజోరం ప్రభుత్వం కరోనా కట్టడికి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య 79 లక్షలు దాటింది. కాగా ఇట‌లీలో రెండు రోజుల్లో 20వేల క‌రోనా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. పూర్తిగా క‌రోనా త‌గ్గిన ఆ దేశంలో మ‌ళ్లీ కేసులు పెరిగాయి. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. అందుకే ఇప్ప‌టి నుంచి న‌వంబ‌ర్ 24వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి గియుసేప్ కొంటే ఉత్త‌ర్వులు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here